Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
మన్నెగూడ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం సాయంత్రం చిన్న పిల్లల స్నాతకోత్సవం(గ్రాడ్యుయేషన్ డే) కన్నుల పండువగా జరిగింది. ప్రాథమిక విద్యా భ్యాసాన్ని పూర్తిచేసుకొన్న చిన్నారులం దరికీి శ్లోక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ చింతల సంగమేశ్వరగుప్త, చైర్మెన్ బిట్ల శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథు¸లుగా హాజరై పట్టాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో కూడా తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంతో ఓర్పుగా ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లకు సహకరించడం వల్లనే పిల్లల చదువులు ముందుకు సాగాయని, ఇందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్లోక విద్యా సంస్థల డైరెక్టర్లు బిట్ల శైలజా రెడ్డి, చింతల వీణాగుప్త ప్రత్యేక అతిథులుగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపల్ విశ్వనాథ రెడ్డి, అకాడమిక్ అడ్వైసర్ ఫాతిమా షబ్నం, సీఎంఓ అరుణ్ కుమార్, కోఆర్డినేటర్లు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.