Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండవిస్తున్న సమస్యలు
- పాలకులు పట్టించుకోరు, అధికారులు స్పందించరు
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్లతో వెలిసిన కాలనీ లలో పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగా మారిం దని, ఎన్నాళ్లీ అవస్థలు పడాలి అని ప్రజలు వాపోతున్నారు. పాలకులు పట్టించుకోరు... అధికారులు స్పందించరా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. ఉప్పల్ మండల పరిధిలోని రామంతాపూర్లోని కేసీఆర్ ,కేటీఆర్ నగర్లో మౌలిక వసతులు కల్పించి అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాలనీలో విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీిఆర్, కేటీఆర్ పేరు పెట్టుకున్నా అభివద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని, ఎక్కడి సమస్యలు అక్కడే తాండవిస్తున్నాయి అని ఆయన వాపోయారు. అధికారంలోకి వస్తే ఇంటి నెంబర్లు ఇప్పిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని ప్రజా ఓట్లతో గెలిచినా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ నగర్లో మౌలిక వసతులు కల్పించి కాలనీ వాసులకు జీవో నెంబర్ 194 ప్రకారం ఇంటి నెంబర్లు కేటాయించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీి కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సమస్యలతో సతమతమవుతుంటే పాలకులు అధికారులు ఇక్కడికి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో తవిడబోయిన గిరిబాబు ఎండీ రఫిక్ వినోద్ ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ శెట్టి పబ్బోజు బిక్షపతి చారీ బేజ్జం యాదగిరి అలాగే కరిపే సంతోష్ మురళీకష్ణ ముదిరాజ్ కిషన్ నాయక్, రమేష్ నాయక్, షబ్బీర్, గుప్తా, చందు, మల్లేష్, బాను గౌడ్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.