Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల
నవతెలంగాణ-అడిక్‌మెట్
దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై దయనీయస్థితిలో జీవనం సాగిస్తున్న అనాథలు, అభాగ్యులు నిరాశ్రయులను, మతిస్థిమితం లేని వాళ్లకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 200 అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరై పేదలకు అన్నదానం చేశారు. స్కై ఫౌండేషన్ నిస్వార్థంగా సేవలు అందిస్తుందన్నారు. క్రమం తప్పకుండా అన్నదానాలు చేయడం చాలాగొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు సుచిత్ర, నేహా, చందన, కీర్తి, కుషికోమాల్, శిరీష, ప్రవళిక, హర్ష, జతిన్, ఇర్ఫాన్, సాకేత్, అఖిల్, శ్రీనాథ్, మల్లేష్, ఉపేందర్, స్వప్నిల్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.