Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
పోచారం చైర్మెన్ బోయపెల్లి కొండల్‌రెడ్డి రాజాకీయ ఎదుగుదలను చూసి ఓరువలేక లేనిపోని ఆరోపణలు కౌన్స్లర్ బాలగోని వెంకటేష్‌గౌడ్‌కు తగదని పోచారం మున్సిపాలిటీ వైస్‌చైర్మెన్ నానావత్ రెడ్యానాయక్, కౌన్స్లర్ చింతల రాజాశేఖర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లిశంకర్, నాయకులు బోయపెల్లి రాజాశేకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీగూడ ఎన్.టీ.పీి.సీి రోడ్డులోని రియల్ ఎస్టేట్ కార్యాలయంలో బుధవారం విలేకరులు సమావేశంలో వారు మాట్లాడుతూ కౌన్స్లర్ బాలాగోని వెంకటేష్‌గౌడ్ చేసిన ఆరోపణలను నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తామని, వెంకటేష్‌గౌడ్ రెండుసార్లు ఉపసర్పంచ్‌గా పని చేశారని అప్పుడు పార్కు స్థలాలు కబ్జాలు గుర్తుకురాలేవా అని ప్రశ్నించారు. తనకంటే చిన్నవాడు చైర్మెన్‌గా మున్సిపాలిటీిని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరైంది కాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జితేంతర్నాయక్, కె.యం.రెడ్డి, గుగులోత్ గోవింద్‌నాయక్, లక్ష్మణ్‌యాదవ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.