Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-హయత్నగర్
బీజేపీ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిని క్షణాల్లో తొలగిస్తు న్నారు. అదే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తే వాటిపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. సాక్షాత్తు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి జరిమానా విధించాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా ఎల్బీనగర్లో మాత్రం అతని కళ్ళ ముందు ఫ్లెక్సీలు కనిపిస్తున్నా నోరుమేదపరని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎల్బీనగర్లో పలు అభివద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన సందర్భంగా పలుచోట్ల విచ్చలవిడిగా టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూడాలి మరి ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ మంత్రి మాటలకు విలువ ఇచ్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి జరిమానా విధిస్తారో, ఎమ్మెల్యే అనుచరులు అని వదిలేస్తారో.