Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు మూడు నెలల్లో కొత్త పింఛన్లు : ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్
- కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురండి
- ఎల్బీనగర్లో అండర్‌పాస్, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్లు ప్రారంభం
నవతెలంగాణ-హయత్‌నగర్
గ్రేటర్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు, సులువైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్ రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్ పాస్ (కుడివైపు), రూ.28.642 కోట్లతో బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌ను బుధవారం ఆయన మంత్రు లు అధికారులతో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. వర్షాలు, వరదల వల్ల ఎల్బీనగర్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వరద ముంపు నివారణకు రూ.వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఎల్బీనగర్ పరిధిలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు 12 రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. 353 కిలోమీటర్ల మేర వాటర్ పైపులైన్లు వేశామన్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్లో భూ రిజిస్ట్రేషన్ సమస్య కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్లు రెండు నుంచి 3 నెలల్లో అందజేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధులు తీసుకురావాలని కోరారు. కిషన్‌రెడ్డి నిధులు తేగలిగితే ఆయనకు తెలంగాణ ప్రజల తరఫున పౌర సన్మానం చేస్తామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం లో కేటీఆర్‌తోపాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మేయర్ గద్వాల విజయలక్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.