Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఐఈపీఎల్ కంపెనీ అభివృద్ధి కోసం 35 ఏండ్ల నుంచి తమ జీవితాలను త్యాగం చేసిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఐఈపీఎల్ కార్మికులను అకార ణంగా తొలగించినందుకు 16 రోజులుగా కంపెనీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపడుతున్నారు. కార్మికులకు మద్దతుగా బుధవారం సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో జీడిమెట్ల పోస్టాఫీస్ నుంచి ఐఈపీఎల్ కంపెనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కార్మికులకు చట్టపరంగా రావాల్సిన సౌకర్యా లు కూడా ఇవ్వకుండా ఒక్క నోటీసుతో యజమాన్యం కార్మికులను బయటపెట్టడం ఎంత వరకు సమంజస మన్నారు. నష్టాల పేరుతో కంపెనీని మూసేసి అక్కడ ఉన్న స్థలంలో షెడ్లు నిర్మించి లక్షల్లో అద్దెలు వసూలు చేస్తూ కార్మికుల కడుపు కొట్టాలని ప్రయత్ని స్తున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చట్టపరంగా రావాల్సిన సౌకర్యాల కోసం ఎంత టి త్యాగానికైన ఎర్రజెండా నాయకత్వం ముందుంటు ందన్నారు. సమస్యను వెంటనే సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనీ, లేని పక్షంలో రాబోయే కాలంలో ఎలాంటి పోరాటానికైనా ఐఈపీఎల్ కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్, జిల్లా నాయకులు కిలుకాని లక్ష్మణ్, జీడిమెట్ల గాంధీ నగర్ క్లస్టర్ నాయకులు ఈశ్వర్రావు, భీరప్ప, దేవదా నం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు హరినాధ్, ఉమామహేష్, రాములు, రాము, శ్రీనివాస్, సుంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.