Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిడ్నీ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచేందుకు కిడ్నీ అవేర్నెస్ రన్ నిర్వహించారు. 'కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్' అనే థీమ్‌తో ఈ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ ఎండీ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ''ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్ ఏటా మార్చిలో కిడ్నీ అవేర్ నెస్ రన్ నిర్వహిస్తోంది. ఇది ప్రధానంగా ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనీ, ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరుతున్నాం'' అని తెలిపారు. మెరుగైన కిడ్నీ ఆరోగ్యం కోసం ప్రజలు తమ కిడ్నీలను పరీక్షించుకోవాలనీ, అవగాహన అంతరాన్ని తొలగించుకోవాలని ఏఐఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి సూచించారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై ఏఐఎన్ యూ హైటెక్ నుంచి ఎన్ కన్వెన్షన్ రోడ్డు మీదుగా తిరిగి హైటెక్స్‌లో ముగిసే విధంగా 5 కిలో మీటర్లు, 10 కిలో మీటర్లతో నిర్వహించిన ఈ రన్లో 500 మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. నటుడు జగపతి బాబు, సినిమా దర్శకులు దిల్‌రాజు, ఏఐఎన్‌యూ ఎండీ డాక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.