Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఏ1 ఆధారిత సాఫ్ట్వేర్ అప్లికేషన్లను విస్తతంగా వినియోగిస్తున్నందుకు గానూ ఐఏస్ఓ 13485-2016, బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ (బీఎస్ఐ) సర్టిఫికెట్‌ను ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ప్రొవైడర్లలో ఒకటైన అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం అందుకుంది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ డివైస్ ఇండిస్టీలో, ప్రత్యేకమైన నాణ్యత, నిర్వహణ వ్యవస్థ కోసం అవసరమైన వాటిని వివరించే, బీఎస్ఐ నాణ్యత ధ్రువీకరణను అందుకోవడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. కరోనరీ పీరియా బిటెస్, డయాబెటిస్, సీఓపీడీ, ఆస్తమా, లివర్ ఫైబ్రోసిస్, వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఒక వ్యక్తిలో ముందుగా అంచనా వేయడంలో, ప్రయోగాత్మక యాంటీబయోటిక్ సిఫార్సుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ1) ఆధారిత క్లినికల్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించేందుకు, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇచ్చారని అన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ 'అపోలో హాస్పిటల్స్ తన క్లినికల్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, అభివద్ధి, విస్తరణలో నాణ్యత నిర్వహణలో అత్యుత్తమమైన విధానాలను అవలంభింస్తుంది. రోగి డేటా, నాణ్యత, భద్రతను ప్రభావవంతంగా ధవీకరిస్తూ ఉంది. అదే సమయంలో తమ వైద్యులు, రోగుల ప్రయోజనాల కోసం వినియోగదారు- స్నేహపూర్వక సాంకేతిక పరిష్కారాలను అభివద్ధి చేయడంలో, అమలు చేయడంలో తమ ప్రయత్నాలను గుర్తిస్తుంది' అని అన్నారు.