Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెరైటీ రుచుల్లో గోలి సోడాలు లభ్యం
- స్మార్ట్ డిజైన్లలో ఆకట్టుకుంటున్న వైనం
- సాధారణ పానీయంగా ఇష్టపడుతున్న జనం
- ఫుట్‌పాత్‌ల నుంచి రెస్టారెంట్లలో అమ్మకాలు
సోడాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. బ్రాండెడ్ శీతల పానీయాలు మార్కెట్‌ను ముంచెత్తిన నేపథ్యంలో ఆదరణ కోల్పోయిన దేశీయ గోలి సోడాకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. చూస్తేనే ఉవ్విర్లూరే గోలిసోడాలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. వెరైటీ రుచుల్లో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్లుగా గోలిసోడాలు మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిని స్థానికంగానే తయారుచేస్తారు. సాధారణంగా భుక్తాయాసం పోవడానికి, శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించుకునే నేపథ్యంలో గోలిసోడా తాగి ఉపశమనం పొందేవారు. ఇప్పటి ట్రెండ్‌లో జంక్ ఫుడ్, ఫ్రైడ్, మసాల ఫుడ్ అలవాటు పడిన జనాలు ఆహారం జీర్ణం కావడానికి కొందరు శీతల పానీయాలు సేవిస్తున్నారు. ఈక్రమంలో వ్యాపారులు మళ్లీ గోలిసోడాలకు కొత్తకొత్త రుచులను రంగరించి తీసుకొచ్చారు.
ఓల్డ్ ఈస్ గోల్డ్
ఒకప్పుడు గోలి సోడా అంటే విపరీతమైన ఆదరణ ఉండేది. సినిమాల్లో కూడా గోలీసోడాలను వాడేవాళ్లు. ప్రతి బస్తీల్లో ప్రత్యేక బండ్లలో గోలీసోడా లను తీసుకువచ్చి అమ్మేవాళ్లు. గోలి సోడా బండి కనబడితే చాలు చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు కచ్చితంగా దాని వైపు ఆకర్షితులై లాగించే వాళ్లు. ఇక ఇది ఎవరైనా తాగవచ్చు. గోలి సోడాలో ప్రకతి గుణాలు నిమ్మకాయలతో చేసినవి సహజసిద్ధంగా తయారు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆస్వాదించేవారు. కాలక్రమేణ గోలీ సోడాలు కనుమరుగయ్యాయి శీతల పానీయాలు ఎక్కువగా మార్కెట్లో లభ్యమవుతున్న ఈ సమయంలో గోలి సోడా గిరాకీ లేకుండా పోయింది. వేసవి కాలాన్ని దష్టిలో ఉంచుకొని మార్కెట్లో కొత్త రకమైన గోలి సోడా లో అందుబాటులో ఉండడంత ప్రజల దష్టి విపరీతంగా ఆకర్షిస్తూ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది.
మాస్ టూ క్లాస్
ఒకప్పుడు మార్కెట్, సినిమా థియేటర్లలో సాధారణ గోలిసోడా, స్వీట్ గోలిసోడా(లెమన్)లకు డిమాండ్ ఉండేది. నేల టికెట్ నుంచి బాల్కనీ వరకు అన్నివర్గాల ప్రేక్షకులు తాగేవారు. ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌తో కస్టమర్లను ఆకట్టుకునేలా స్మార్ట్, సైల్గా లెమన్, సాల్ట్, గ్రేప్స్, ఆరెంజ్, సాల్టిండె స్వీట్ రుచులతో పాటు చెట్లవేర్లతో ద్రవాన్ని తయారు చేసి గోలి సోడాలు అందిస్తున్నారు. గతంలో మార్కెట్ ప్రాంతంలో సాధారణ సోడా బండి ఉండేది. లేటేస్టుగా పదుల సంఖ్యలో బండ్లు, అన్నీ బేకరీలు, రెస్టారెంట్లలో సోడాలు అమ్ముతున్నారు. డస్ట్ ప్రూఫ్ సీసాలతో కొందరు వ్యాపారులు కస్టమర్లను గోలి సోడా తాగేలా చేస్తున్నారు. కుటీర పరిశ్రమ కావడంతో యువత మొదలుకుని రిటైర్మెంట్ వయస్సుగల వారు తాత్కాలిక, శాశ్వత ఉపాధి పొందుతున్నారు.