Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే నిరుద్యోగులకు ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావ అన్నారు. బుధవారం సీతాఫలమండీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. సికింద్రాబాద్‌లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను పొందేందుకు మంచి కోచింగ్ సదుపాయం, స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దశాబ్దాల కలగా నిలిచిన తుకారంగేటు ఆర్యూబీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తమ హయాంలోనే విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. సీతాఫలమండీ నుంచి ఉస్మానియా క్యాంపస్, మాణికేశ్వరినగర్ వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు రైల్వే ట్రాక్ అడ్డుగోడగా నిలుస్తుండడంతో రైల్వే ట్రాక్ కింది నుంచి ఆర్యూబీ నిర్మించాలని ప్రతిపాదించామని, రూ. 20 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. సీతాఫల్‌మండీ కుట్టి ఎల్లోడి ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని 70 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. జూనియర్/డిగ్రీ విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల కోసం కొత్త భవన సముదాయ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేయించామని తెలియజేశారు. సమావేశంలో టీఆర్ఎస్ యువ నేత టి.రామేస్వర్ గౌడ్ పాల్గొన్నారు.