Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి
నవతెలంగాణ-కల్చరల్
ఒక్కప్పుడు సినిమా కథానాయకుడు పాత్ర ఎంతో సంస్కార వంతంగా, సంప్రదాయంతో కూడుకొని ఉండేదని, నేడు హీరో పాత్ర అంటే స్మగ్లర్, రౌడీ, గూండా అనే అర్థంగా మారి పోయిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి పేర్కొన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలో బుధవారం యువకళావహిని సాంస్కతిక సంస్థ నిర్వహణలో విఖ్యాత నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ రాధా రాణి పాల్గొని అక్కినేని అభినయ పురస్కారం ప్రముఖ నట, దర్శకులు గిరిబాబుకు, దర్శక ప్రతిభా పురస్కారం బి. గోపాల్ కు బహుకరించి మాట్లాడారు. అక్కినేని విద్యాలయంలో చదువుకోకున్నా సమాజాన్ని చదివిన విజ్ఞాన వంతులన్నారు. నాటి నటులు తమ పాత్రాలతో సమాజాన్ని ఉన్నతంగా నిలిపితే, నేటి చిత్రాలు ప్రభావంతో ఔన్నత్యం దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షత వహించిన అక్కినేని నాటక కళా పరిషత్ స్థాపకులు సారిపల్లి కొండల రావు మాట్లాడుతూ అక్కినేని ఉన్నత నటులని ఆయన పేరిట ప్రతి వత్సరం నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ విశ్రాంత కమిషానర్ గాంధీ మాట్లాడుతో అక్కినేని జీవితాంతం నాస్తికుడుగా ప్రకటించుకున్న ఏకైక నటులని వివరించారు. దర్శకుడు కోదండ రామి రెడ్డి, నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి పురస్కార గ్రహీతలను అభినందించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్ బాబు, బాల కామేశ్వరరావు, సురేఖ, శారద తదితరులు మధురంగా సినీ గీతలు గానం చేశారు. సినీ జర్నలిస్ట్ ఎస్ వీ రామారావు వ్యాఖ్యనం చేశారు.