Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని 12-14 సంవత్సరాల విద్యార్థులకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 12-14 సంవత్సరాల పిల్లలందరు కరోనా బారిన పడకుండా ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న విషయం మీ అందరికీ విదితమే అని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రు లు పిల్లలను వ్యాక్సిన్ వేయించుకునే విధంగా వారిని మానసికంగా సన్నద్ధం చేయాలని, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు చేయూతనివ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, విజరు భాస్కర్‌రెడ్డి, జక్కిడి. రఘువీర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, అశోక్ యాదవ్, ఆనంద్, నర్సింహా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.