Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ-ఓయూ
లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య కోరారు. బుధవారం రాత్రి ఓయూ లేడీస్ హాస్టల్ బ్లాక్ 4లో పర్యటించి అక్కడ విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా విద్యార్థినిలు ఆయనకు పలు సమస్యలను విన్నవించారు. హాస్టల్లో వాటర్ సౌకర్యం సరిగ్గా లేదని, ఆహారంలో నాణ్యత లేదని, ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్‌కు మూడు పూటలు మెస్, టిఫిన్, డిన్నర్ కోసం తిరగడంతో అలసిపోతున్నాట్లు వాపోయారు.
హాస్టల్లో ఒక్కొక్క రూమ్ ఎక్కువ మంది విద్యార్థులకు కేటాయించటంతో పాటుగా సరిపడా బెడ్స్ లేవని, అనుబంధం కాలేజీలకు వెళ్లాలంటే బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఓయూ అధికారులు తప్పకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారం రోజుల్లో పరిష్క రించాలన్నారు. వారికి ఇబ్బందులు ఎదురుకాకుండా పరిష్కారం చేసేందుకు సన్నాహాలు చేయాలని అక్కడే ఉన్న ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్, డైరెక్టర్ డా.పద్మలకు సూచించారు. విద్యార్థిని కూడా కొంత సమన్వ యం పాటించాలన్నారు. విద్యార్థి నులు ఎక్కువగా రావడంతో ఇలా కొంత హాస్టల్ కొరత ఏర్పడిందని సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తున్నట్లు ప్రొ.రెడ్యా నాయక్ చెప్పారు.