Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సీ) హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం శిల్పకళావేదికలో బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి అథితిగా హాజరైన ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ అనికేత్ తలతి మాట్లాడుతూ బ్యాంక్ ఆడిట్ ప్రాముఖ్యతను, పటిష్టమైన బ్యాంకింగ్ రంగంను నిర్వహించండంలో ఐసీఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ రంగాన్ని నిర్వహించడానికి ఐసీఏఐ ముందు ఉంటుందన్నారు. ఐసీఏఐ (ఎస్ఐఆర్సీి) చైర్మెన్ చిన్న మస్తాన్ తలకాయల మాట్లాడుతూ బ్యాంక్ ఆడిట్‌కు సంబంధించి ఎస్‌ఐఆర్‌సీ నిర్వహించిన వృత్తిపరమైన కార్యక్రమాల గురించి సభ్యులు, విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ చైర్మెన్ మాచర్రావు మీన వల్లి, ఎస్‌ఐఆర్‌సీ సెక్రెటరీ నరేష్ గెల్లి, రీజనల్ సభ్యులు పాల్గొన్నారు.