Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి, యువ నేత కార్తీక్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంద్రన్న మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో తుక్కుగూడలో ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇంద్రన్న మెమోరియల్ ట్రస్టు చైర్మెన్ పి.కార్తిక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువత రానున్న పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన కోచింగ్‌ను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర టీిఆర్‌ఎస్ యువ నాయకులు, ఇంద్రన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ పి.కార్తీక్‌రెడ్డి సహకారంతో ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూపు 3, గూపు 4 ఉద్యోగా లకు సంబంధించి కోచింగ్ ఇవ్వను న్నట్లు పేర్కొంది. ఈ కోచింగ్‌ను నగరంలో పేరొందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.జగదీశ్వర్‌రెడ్డి నేతత్వం లో అందజేయ నున్నట్లు వారు వెల్లడించారు. తుక్కుగూడలో ఇందుకు సంబంధించి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, మీర్పేట్, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కోచింగ్ ఏప్రిల్ మొదటి వారంలో తరగతు లను ప్రారంభిం చనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ తెలిపారు.