Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచమంద్రరావు ఖబడ్దార్ అనడం సరికాదు
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-మల్కాజిగిరి
'నాగిరెడ్డి చెరువు ఫంక్షన్ హాల్‌పై ఇద్దరం కోర్టుకు వెళ్దాం. ఫంక్షన్ హాల్ ఇల్లీగల్ కాదు అని స్టే వస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం. ఇల్లీగల్ అని స్టే వస్తే మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఏం చేస్తారో చెప్పాలి' అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బుధవారం ఆనంద్‌బాగ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. మల్కాజిగిరిలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేం దుకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్థానికులను రెచ్చగొడుతు న్నారన్నారు. కబ్జా చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారనీ, నన్ను ఖబడ్దార్ అని ఎందుకు అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డి చెరువు ఫంక్షన్ హాల్‌ను ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి కూల్చివేశారని తెలిపారు. ఈ ఫంక్షన్ హాలు ఓనర్ మధుసూదన్ రెడ్డి అధికారులందరినీ మేనేజ్ చేసి మళ్లీ ఫంక్షన్ హాల్ నిర్మించారని తెలిపారు. కోర్టు స్టేలు తెచ్చి ఏడేండ్లు ఆర్యూబీ పనులు నిలిచిపోయేలా చేశారన్నారు. తాను ఏ పార్టీని విమర్శించలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాప్రాల్ ప్రజలు జేఏసీగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు జాయింట్ కమిటీగా ఏర్పడి యాప్రాల్ చెరువు ఒక ఫంక్షన్ హాల్ ఇల్లీగల్ల్ అని నిరూపించి, ఒకసారి కూడా చేయడం జరిగిందనీ, అప్పుడు రామచంద్రరావు కూడా నల్లచెరువు వద్దకు వచ్చి, ల్యాండ్ గ్రాఫర్లకు, ల్యాండ్ మాఫియాకు సపోర్ట్ చేస్తున్నారనీ, ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు గుర్తు చేశారు. అప్పట్లో మేయర్‌గా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా పట్టా ఇచ్చిన ల్యాండ్‌ను పొలంగా చేసుకోవాలి కానీ, కమర్షియల్‌గా వాడే హక్కు మీకు లేదనీ, ఫంక్షన్ హాల్ పూర్తిగా ఇల్లీగల్ అనీ, కూల్చివేయాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడటం రామచంద్రరావుకు సబబు కాదన్నారు. గవర్నమెంట్ తెలిపిన కొలతల ప్రకారం 20 మీటర్ల వరకు పోతుంది కానీ ఓన్లీ బాక్స్ డ్రయినేజీ పని నిమిత్తం మాత్రమే ఆరు నుంచి ఎనిమిది మీటర్లు తీసుకోవటం జరిగిందన్నారు. అక్కడ నాగిరెడ్డి చెరువు వద్ద బాక్స్ డ్రయినేజీ పనికి రూ.41 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. మల్కాజిగిరిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు నాలాలపై అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కూల్చివేస్తామనీ, వరద నీటి ముంపు సమస్యల పరిష్కారానికి, రాజకీయాలకతీతంగా మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, వై ప్రేమ్ కుమార్, రాజేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజిగిరి అధికార ప్రతినిధి సతీష్ కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాము యాదవ్, బద్ధం పరశురామ్ రెడ్డి, కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, జీవాగన్, అనిల్ కిషోర్ గౌడ్, ఎస్ఆర్ ప్రసాద్, మహాత్య వర్ధన్, మల్కాజిగిరి నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు పిట్ల నాగరాజు, మల్కాజిగిరి సర్కిల్ మహిళా అధ్యక్షురాలు గద్వాల జ్యోతి, నర్సింగ్ రావు, ఉపేందర్, బైరు అనిల్ కుమార్, సత్తయ్య పాల్గొన్నారు.