Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం రూ.1700కోట్లు, ఆస్తిపన్నుపైనే ఆశలు
- టౌన్‌ప్లానింగ్ ఆదాయం రూ.1200కోట్లు
- అప్పులు రూ.1302కోట్లు
- 2022-23 బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ ఎట్టకేలకు ఆమోదించింది. రాష్ట్ర బడ్జెట్ తర్వాతనే ఈ బడ్జెట్‌ను పొందుపర్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. దీంతో బల్దియా ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా జీహెచ్ఎంసీ అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయడం తప్ప మరో మార్గంలేదనడానికి బడ్జెట్ అంచనాలే నిదర్శనం. అధికారులు రూపొందించిన రూ.6,150 కోట్ల బడ్జెట్ బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది.
కాకి లెక్కలు..
జీహెచ్ఎంసీ బడ్జెట్ కాకిలెక్కలకే పరిమితమైంది. 2020- 21 వాస్తవ లెక్కల ప్రకారం బడ్జెట్ రూ.4551.08 కోట్లుగా ఉంది. 2021-22 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.5,600 కోట్లుగా నిర్ణయించారు. ఇదే బడ్జెట్‌ను 2021-22 సవరించి రూ.6,300 కోట్లకు పెంచారు. కానీ రూ.150 కోట్లు తగ్గించి 2022-23 బడ్జెట్‌ను రూ.6,150 కోట్లకు పరిమితం చేశారు. వాస్తవ లెక్కల కు, 2022-23 అంచనాలకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే జీహెచ్ఎంసీ పాలకవర్గం నగరవాసులను మరోసారి మోసం చేయడానికి పూనుకుందనడానికి ఈ బడ్జెట్ లెక్కలే నిదర్శనం.
అప్పులు రూ.1302కోట్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదిం చింది. రెవెన్యూ ఆదాయం రూ.2,800 కోట్లు, పెట్టుబడి ఆదా యం రూ.3,350 కోట్లు. అప్పులను రూ.1302 కోట్లుగా చూపిం చారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తిపన్ను ద్వారా రూ. 1700 కోట్లు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా రూ.1200 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ.63 కోట్లు, 15 ఆర్థిక సంఘం నిధులు (పట్టణప్రగతి) రూ.708 కోట్లు. టీడీఆర్ ద్వారా రూ.500 కోట్లు వస్తాయని అంచనా వేశారు. దీంతోపాటు రోడ్డు కట్టింగ్, పునరుద్ధ రణ ద్వారా రూ.25 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ రూ.15 కోట్లు, ముటేషన్ ద్వారా రూ.13 కోట్లు, ఎస్టేట్స్ ద్వారా రూ.11 కోట్లు, వృత్తిపన్ను పరిహారం రూ.10 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.8 కోట్లు, పార్కుల నిర్వహణ ద్వారా రూ.4 కోట్లు, పనుల డిపా జిట్స్ రూ.100 కోట్లు, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.600 కోట్లు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
అప్పులు, వడ్డీ చెల్లింపులకు రూ.500కోట్లు
జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.6,150 కోట్లలో తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించడానికి రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ప్రధానంగా అత్యధిక నిధులు రోడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.1500 కోట్లు ఖర్చు చేయడానికి అంచనా వేశారు. ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణకు రూ.1,140 కోట్లు, నాలా అభివృద్ధి పనులకు రూ.540 కోట్లు ఖర్చు చేయనున్నారు.
7వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలు
7వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆరు అంశాలను ఆమో దించారు. ఆరాంఘర్ జంక్షన్ నుంచి రేతిబౌలి జంక్షన్ వరకు పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ పొడవున ట్రాక్లేన్, సెంట్రల్ మీడియన్ 60 మీటర్ల ప్రతిపాదిత రోడ్డుకు 440 ఆస్తుల సేకరణకు, అత్తాపూర్ బ్రిడ్జి రేతిబౌలి వరకు చేపట్టే 45 ఫీట్ల రోడ్డు వెడల్పులో 36 ప్రాపర్టీ ల సేకరణకు కమిటీ ఆమోదం.
-ఓవెసీి మిధాని జంక్షన్ నుంచి వయా ఫిసల్ బండ మీదుగా కేశవగిరి జంక్షన్ వరకు ప్రతిపాదిత 45 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సెంట్రల్ మీడియన్, ట్రాక్లేన్ వెడల్పు కోసం 78 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
-రుక్మిణి ఎన్క్లేవ్ నుంచి అల్వాల్ మెయిన్ రోడ్డు బొల్లారం వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడానికి 103 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
-నానల్‌నగర్ ఎస్సార్ పెట్రోల్ బంక్ నుంచి టిప్పుఖాన్ బ్రిడ్జి వయా లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మీదుగా ప్రతిపాదిత రోడ్డు వెడల్పు కోసం 164 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
-రూ.5 అన్నపూర్ణ భోజన పథకంలో భాగంగా హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు రెండేండ్లు ఒప్పందం ప్రకారం పొడిగింపు కోసం గ్రాంట్ రూ.24.25 నుంచి గ్రాంట్ రూ.28 పెంచాలని కోరగా రూ.26.25 గ్రాంట్ ఇవ్వడానికి కమిటీ ఆమోదం తెలిపింది.
-ఇంజన్‌బౌలి (సత్తార్ హౌటల్) జహానుమా పానికితన్కి, శామాటాకీస్ మిస్త్రీ గంజ్ మీదుగా ఫతే దర్వాజ వరకు చందులాల్ బరాదారి (హౌసింగ్ బోర్డు కాలనీ) వాటర్‌బోర్డు జంక్షన్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి 274 ఆస్తుల సేకరణకు మోదం.