Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క, సారక్కలపై చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా గిరిజన విద్యార్థి సంఘాలు, దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గిరిజనులు తమ ఇంటి దైవంగా భావించే సమ్మక్క-సారక్కలపై తన ప్రసంగంలో అవమానపరిచే విధంగా మాట్లాడిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ సమితి నాగేశ్వర్ రావు నాయక్, విజరు, తప్పెట్ల ప్రవీణ్, కంపల్లి శ్రీనివాస్, అర్జున్ నాయక్, వేణు, అంబేడ్కర్, బోరెల్లి సురేష్, సుబ్బు నాయక్, శ్రీను నాయక్, రవి భూక్యా, వెంకటేశ్ పవర్, హన్మంతు నాయక్, వినోద్, మహేష్, ప్రణరు, సూరజ్ నాయక్, ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.