Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
పాదయాత్రలో గుర్తించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గురువారం నల్లకుంట డివిజన్లోని నరసింహ బస్తీలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నూతన డ్రయినేజీ, సీసీ రోడ్లు నిర్మాణం, విద్యుత్ స్తంబాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, లైబ్రరీ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింహ బస్తీలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్, మేనేజర్ రోహిత్, ఏఈ శ్వేత, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు మేడి ప్రసాద్, నరేందర్, భాస్కర్‌గౌడ్, రాము యాదవ్, సతీష్ చంద్ర, గులాబ్ సతీష్, భోజరాజు, శంకరన్న, అశోక్, ప్రవీణ్ కుమార్, సంజరు కుమార్, బస్తీ అధ్యక్షులు భూపతినాథ్, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.