Authorization
Fri March 21, 2025 05:04:48 pm
- తండ్రి కూతురి అరెస్టు
నవతెలంగాణ-బోడుప్పల్
రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న తండ్రి కూతుర్లను అరెస్టు చేసి డిమాండ్‌కు తరలించిన సంఘటన మేడిపల్లి పీఎస్‌లో జరిగింది. ఎస్ఐ చంద్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పీర్జాదిగూడలో నివాసం ఉండే నవీన్ చారీ అనే వ్యక్తి నుంచి అతని సమీప బంధువైన గొల్లపల్లి నాగరాజు, కూతురు దివ్య ఇద్దరు కలిసి రైల్వే శాఖలోఉద్యోగం పెట్టిస్తామని చెప్పి రూ.5 లక్షలు తీసుకున్నారు. కొద్ది రోజుల అనంతరం అపాయిట్మెంట్ లెటర్ వచ్చినట్లు నమ్మించి నవీన్ చేతికి లేటర్ ఇచ్చారు. సదరు లేటర్ తీసుకొని రైల్వే కార్యాలయంలో సంప్రదించగా అది నకిలీది అని తెలిసింది. దీంతో మోసపోయినట్లుగా గమనించిన నవీన్ స్థానిక మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు అతని కూతురు దివ్య మరో 20 మంది నిరుద్యోగుల నుంచి కూడా ఇలాగే డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.