Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
హమాలీలు రైతులకు, వ్యాపారులకు, మార్కెట్ కమిటీకి సంధానకర్తలుగా పని చేస్తూ మార్కెట్ సజావుగా నడిచేందుకు కృషి చేయాలి అని బోయిన్పల్లి మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. బోయిన్పల్లి మార్కెట్లో పని చేస్తున్న వెయ్యి మంది హమాలీలకు మార్కెట్ కమిటీ తరపున కుట్టి చ్చిన యూనిఫామ్, లైసెన్సులను గురువారం అందజే శారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసా య మార్కెట్లు సజావుగా సాగేందుకు హమాలీల పాత్ర కూడా ఎంతో ఉందన్నారు. హమాలీలు మార్కెట్లో ఇంకా సజావుగా విధులు నిర్వహించి మార్కెట్కు మరింత మంచి పేరు వస్తుంన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, మార్కెట్ హమాలీ యూనియన్ అధ్యక్షులు ఎం.నరసింహ మాట్లాడుతూ మార్కెట్లో పని చేస్తున్న అన్ని రకాల హమాలీలకు కూడా యూనిఫారమ్స్ అందజేయాలని కోరారు. మార్కెట్లో హమాలీలు ఏండ్లుగా పని చేస్తున్నారనీ, వారికి రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వ తరఫున పెన్షన్ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనీ, మార్కెట్లో పని చేస్తున్న హమాలీలందరికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు గ్రేడ్ 3 సెక్రటరీ సత్యనారాయణ, సూపర్వైజర్లు జహంగీర్, రాంబాబు, మధు, హమాలీ యూనియన్ నాయకులు బుచ్చయ్య, కొమురయ్య, గట్టయ్య, రాజయ్య, ఐలయ్య, రాజు, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.