Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ లిక్విడిటీ ఫర్మ్ - గోల్డ్ సిక్కా త్వరలో గోల్డ్ ఏటీఎంను మార్కెట్లోకి తీసుకురాను న్నట్టు ప్రకటించింది. బేగంపేటలోని గోల్డ్ సిక్కా కార్యా లయంలో నిర్వహించిన సమావేశంలో గోల్డ్ ఏటీఎంకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్‌లోని అబిడ్స్, పాన్‌బజార్, గాన్సి బజార్ ప్రాంతాల్లో ఈ గోల్డ్ ఏటీఎంలను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ప్రకటిం చింది. ఏడాదిలోగా 3 వేల గోల్డ్ ఏటీఎంలను దేశవ్యా ప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ సీఈవో సయ్యద్ తరూజ్ తెలిపారు. ప్రస్తుతం తాము జారీ చేసే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కార్డుల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చనీ, తమ గోల్డ్ ఏటీఎంల నుంచి 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు గోల్డ్‌ను కొనే వీలుందన్నారు. ఇంటర్నేషనల్ లైవ్ ట్రేడింగ్ ధరల ఆధారంగా తాము గోల్డ్ విక్రయాలను జరుపుతామనీ, తద్వారా వినియోగదారుడు బంగారం కొనుగోలులో ఉత్తమ ధర పొందగలుగుతారని తరూజ్ పేర్కొన్నారు. మామూలు ఏటీఎం మాదిరిగానే ఇది పని చేస్తుందనీ, దీని తయారీ, సాంకేతికత కోసం ట్రూనిక్స్ డేటావేర్, కెఎల్-హైటెక్ వంటి కంపెనీలతో జట్టు కట్టినట్టు తరూజ్ తెలిపారు.