Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచె సమ్మక్క-సారలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారా యణకు ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ప్రజలకు వెంటనే బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ కుమారు, వజన, తదితరులు పాల్గొన్నారు.