Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
విద్యార్థులు 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొం దించుకోవాలని సైదాబాద్ డిప్యూటీ ఈఓ విజయలక్ష్మీ అన్నారు. గురువారం మలక్ పేట్‌లోని ప్రభుత్వ పాఠశా లలో క్వెస్ట్ అలయన్స్ సంస్థ సహకారంతో బాలికల కోసం అభివృద్ధిి చేసిన ఐబీఎం స్టెమ్ అనే కార్యక్ర మంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజ ేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లోని బాలికలు లింగ మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడం, కెరీర్ల అవకాశాలను అన్వేషించడంలో ఈ స్టెమ్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్ పటిమ, జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు అన్నారు. స్టెమ్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రామ్ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడేండ్ల ప్రయాణాన్ని గురు వారం నిర్వహించిన ఫైనల్ ప్రాజెక్ట్ షేర్-అవుట్ ఈవెంట్‌తో ముగించిందని తెలిపారు. సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం, విమర్శనాత్మకంగా, సాను భూతితో ఆలోచించడం, సహకారంతో పని చేయడం ఎంతో ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యారు ్థలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.