Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుర్కయంజాల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఇంటింటికీ ఉచిత తాగునీరు అందించాలని తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం హెచ్ఎండబ్ల్యూ ఎస్ అధికారి ఎండి. దాన కిషోర్‌కు మున్సిపాలిటీలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీరు ఇచ్చి, పాత బకాయిలను రద్దు చేయాలని అనురాధ రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్‌తో కలిసి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ దాడులు ఆపాలనీ, వాటర్ కనెక్షన్లును రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాకుమాను సునీల్, కంబాలపల్లి ధనరాజ్, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి మరి మాధవి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.