Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జోనల్ కమిషనర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారి, జలమండలి జనరల్ మేనేజర్లతో కలిసి గురువారం జూబ్లీహిల్స్ డివిజన్ బసవతారకం నగర్, బద్దం బాల్ రెడ్డి నగర్, గౌతమి నగర్లలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాబోయే వేసవి కాలం దష్టిలో ఉంచుకుని వాటర్ బోర్డు అధికారులు మంచినీటి మురుగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఫిలింనగర్లోని ఓ వీధిలో ఇప్పటికే రూ.38 లక్షలతో మురుగు నీటి పైప్ లైన్ పనులు చేయడానికి ప్రక్రియ ప్రారంభించినట్లు వాటర్ బోర్డు జీఎం హరి శంకర్ వెల్లడించారు. వ్యర్థాల తొలగింపు, కమ్యూనిటీ హాల్లో ఇతర సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని, రెవెన్యూ సిబ్బందితో సంప్రదించి ప్రభుత్వ స్థలాలు జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకొని టెండర్ల ద్వారా ప్రక్రియలను త్వరలోనే పూర్తి చేస్తామని జోనల్ కమిషనర్ తెలిపారు. సీసీ రోడ్లు ఇతరత్రా సమస్యలను ప్రాజెక్టుల ద్వారా త్వరగా పూర్తి చేస్తామని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీరు అధికారి, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ ఎత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశించారు.