Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అభివృద్ధి పనులలో జాప్యం చేయకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శీరిష బాబురావు అన్నారు. డివిజన్ పరిధిలోని కేపిహెచ్బికాలనీ భువన విజయం గ్రౌండ్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె గురువారం పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, ఏఈ సాయిప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య, నాయకులు పవన్‌కుమార్, రంగా మోహన్, ధనలక్ష్మి, మన్మథ్, భాస్కర్, శారద, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.