Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బ్యాగరి వెంకటేశ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బీజేపీ ప్రభుత్వం విద్యార్ధి వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బ్యాగరి వెంకటేశ్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. పోరాటాల ద్వారా కార్మిక చట్టాలను రక్షించుకోవాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు సమ్మెలో పాలొంటున్న కార్మికులకు తమ మద్దతు ఉంటుందని, తాము కూడా సమ్మెలో పాల్గొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్, మండల నాయకురాలు కీర్తన గణేష్ తదితరులు పాల్గొన్నారు.