Authorization
Sat March 22, 2025 12:59:00 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) కుత్బుల్లాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గాజుల రామారంలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి పాల్గొన్నారు. నూతన కార్యావర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా వనజ అశోక్ (అశోక్ మెమోరియల్ హై స్కూల్), ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ (మా హై స్కూల్), కోశాధికారిగా కొండేటి నర్సిరెడ్డి (స్వామి వివేకానంద స్కూల్), ఉపాధ్యక్షులుగా తిరుపతిరెడ్డి, ఛాయాదేవి, పవన్, శ్రీకాంత్, రేణుక, పరుశురాంగౌడ్, ఉపేందర్, జాయింట్ సెక్రటరీగా సారిక, బల్వంత్ యాదవ్, పద్మ, కామేశ్వరి, రాజు, మోహన్ లక్ష్మీలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలు వనజ అశోక్ మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, సీనియర్ కరస్పాండెంట్ కోటిరెడ్డి, విద్యాసాగర్, త్రెప్టు సొసైటీ కోశాధికారి ఆనంద్, షబానా సుల్తానా, మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.