Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28-29 తేదీల్లో 'ప్రజలను కాపాడండి-దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జాతీయ ఫెడరేషన్లు నిర్ణయించాయనీ, ఈ సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సీిఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఆటో ప్రచార జాతాను పాలడుగు భాస్కర్ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, కార్మిక సంఘాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ పార్లమెంట్లో చట్టం చేసిందన్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నదనీ, సామా జిక భద్రతా కోడ్, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం-పని పరిస్థితుల కోడ్లతో పీిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నదనీ, తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నద న్నారు. సుమారు 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ లేబర్ కోడ్లతో అనాధలుగా మారనున్నారనీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త లేబర్ కోడ్లతో కార్మికవర్గం తిరిగి బానిసత్వంలోకి నెట్టబడ్తున్నదనీ, కార్పొరేట్ల, యాజమాన్యాల లాభాల కోరల్లో కార్మికుల జీవితాలు బలిపశువులయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించిందన్నారు. చివరికి కార్మిక సంఘాల మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను మరిన్ని ఉధృత పోరాటాల ద్వారా రక్షించుకోవాలనీ, రైతాంగ పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ రక్షణ, కనీస వేతనం రూ.26 వేలు, ధరల తగ్గింపు కోసం జరగనున్న సమ్మెలో నగరంలోని కార్మికవర్గమాంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతా చిక్కడపల్లి మీదుగా అశోక్‌నగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, దయారా మార్కెట్, విద్యానగర్, నల్లకుంట, వీఎస్టీ, సుందరయ్య పార్కు, తదితర ప్రాంతాల్లో తిరిగింది. ఈ జాతాలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, కోశాధికారి ఆర్.వాణి, ముషీరాబాద్ జోన్ సీఐటీయూ కన్వీనర్ జి.రాములు, నాయకులు కె.రమేష్, శ్రీరాములు, వెంకటేష్, అజీజ్‌పాషా, ఈశ్వర్రాబు, నగర కమిటీ సభ్యులు పుల్లారావు, తదితరులు హాజరయ్యారు.