Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో భార్య ఫిర్యాదుతో వెలుగులో..
- అరెస్టు చేసిన బేగంపేట పోలీసులు
నవతెలంగాణ-కంటోన్మెంట్
కన్న తండ్రి మానవత్వాన్ని మరిచి కొన్నేండ్లుగా కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అతడి రెండో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి నట్టు బేగంపేట్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రమేష్ బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి బోయిన్‌పల్లిలో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని వివాహం చేసు కుంది. కాగా కూతురు మాత్రం తండ్రి వద్దనే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత రమేష్ సైతం మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నేండ్లుగా తనతోపాటు ఉంటున్న కూతురుపై లైంగికదాడికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ అమ్మాయిని బెదిరించేవాడు. విషయం గమనించిన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.