Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ కేంద్ర ప్రభుత్వ, కార్మిక, ఉద్యోగ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28, 29న జరిగే దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని గురువారం అడ్డగుట్టలోని లేబర్ అడ్డా వద్ద మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కన్వీనర్ టి.మహేందర్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందునుండే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెను భారంగా మారుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు అప్పనంగా అమ్మడం దుర్మార్గం అని, దాన్ని వెంటనే ఆపాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం ,1979 అంతరాష్ట్ర వలస కార్మికుల రక్షణ చట్టం, నిర్మాణంలో వాడే ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన 1005 కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమచేయాలని,పెండింగ్‌లో ఉన్న క్లైమ్లకు నిధులను విడుదల చేయాలన్నారు. మార్చి 28,29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో జోన్ నాయకులు ఆర్ మల్లేష్, అడ్డ నాయకులు సాయిలు, శ్రీకాంత్, యాదగిరి, కష్ణ, కేశవ్, శ్రీనివాస్, శేఖర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.