Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఓయూ కమిటీ ఆధ్వర్యంలో గణిత, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో 240 విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మెంబర్షిప్ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు హాస్టల్, వాటర్, నాణ్యత లేని భోజనం, టిఫిన్, లంచ్కి గంటల పాటు లైన్లో నిలబడాలని, తరగతలుకు సమయానికి వెళ్లలేకపోతున్నామని తదితరు సమస్యలను ఎస్ఎఫ్ఐ దష్టికి తీసుకొచ్చారు. యూనివర్సిటీ అధికారులు వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని లేకపోతే విద్యార్థులను సంఘటితం చేసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ 'చదువుతూ పోరాడుదాం! చదువుకై పోరాడుదాం'!! నినాదంతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందన్నారు. అందరికీ విద్య, ఉద్యోగాలు కల్పించాలని, విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం, స్థూల జాతీయ ఉత్పత్తి జీడీపీలో 6 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలన్నారు. ప్రజాతంత్ర శాస్త్రీయ, అభ్యుదయకరమైన విద్యా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యంగా విద్యార్థుల హక్కులను కాపాడాలని కోరారు. విద్యలో మతతత్వ భావాలను జోపించవద్దు అని, విద్యా వ్యాపారీకరణ ఆపాలన్నారు. ద్యార్థులందరికీ కనీస సౌకర్యాలు హాస్టల్ వసతితో కూడిన బోధన, క్రీడలు సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేవిధంగా విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలన్నారు. కుల, మత, జాతి, భాష, ప్రాంతీయ, లింగ, వివక్షతలు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడటం, లౌకికతత్వం, మత సామరస్యం, శాంతి సమానత్వ స్థాపన, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు విజరు నాయక్, రామటేంకి శ్రీను, రవి కేథన్ పాల్గొన్నారు.