Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, కాప్రా
మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్ యూనియన్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్తో కలిసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి . ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాలు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడతాయని, సమాజ సేవ చేసేందుకు యువత ముందు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన ఇమ్రాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, రమేష్, చంద్రశేఖర్, మల్లారెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.