Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ ఓల్డ్ మల్కాజిగిరిలోని బస్త్తీి దవాఖాన పనులను వెంటనే మొదలు పెట్టాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిఫెయిల్ కాలనీ ప్రజల పైన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుపైన నాలా పనులను ఆపాలంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివద్ధిలో కలిసి నడుద్దామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు పిలుపునిస్తూ, ఓల్డ్ మల్కాజిగిరిలో బస్తీ దవాఖాన పనులను మొదలు పెట్టిన తర్వాత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పనులను ఆపమన్నారంటూ జోనల్ కమిషనర్ పనులు నిలిపి వేయడం జరిగిందన్నారు. కావున పేద ప్రజలను దష్టిలో పెట్టుకొని జోనల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని యధావిధిగా బస్తీ దవాఖాన పనులను మొదలు పెట్టే విధంగా బస్తీ దవాఖాన పూర్తయ్యేటట్లు చూడాలని కోరుతున్నామని తెలిపారు.