Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
దేశాన్ని పురోగాభివద్ధి వైపు నడిపించే సామర్థ్యం నేటి యువతకే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చాడా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల 91వ వర్ధంతిని పురస్కరించుకుని అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లోని లయన్స్ క్లబ్ హాల్ లో ''స్వాతంత్య్ర పోరాటంలో భగత్ సింగ్ - నేటి యువత కర్తవ్యం'' అనే అంశంపై 'సదస్సు' నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా చాడా వెంకట్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సదస్సు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్ ఎనలేని పోరాటం సల్పించాడని, చిరుప్రాయంలొనే దేశం కోసం వీరమరణం పొందిన భగత్‌సింగ్ ఆశయ సాధనకు నేటి యువత కషిచేయాలని వారు తెలిపారు. భగత్‌సింగ్ స్పూర్తితో నేటి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, ఉపాధ్యక్షుడు కాసర్ల నాగరాజు, వెంకటేష్,నవీన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, రాకేష్, నేతలు దిశ, రమ్య, కీర్తన, రవళి, నస్రీన్, రూపా, కిరణ్, ప్రదీప్, నరహరి పాల్గొన్నారు.