Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వివాహ మహోత్సవం సందర్భంగా వైఎస్‌రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టీిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు చామకూర భద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీి ఏనుగు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. చలివేంద్రాన్ని శనివారం వివాహ మహోత్సవ సందర్భంగా ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్యయాదవ్, వార్డు సభ్యులు మల్లేష్, వీరేశ్, కుశలవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ పోచ్చిరెడ్డి, టీిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, మండల జనరల్ సెక్రెటరీ ప్రవీణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సాయిలు, జనరల్ సెక్రటరీ నాగరాజు, నాయకులు ప్రభాకర్, కష్ణయ్య, మచ్చేందర్‌రెడ్డి, ఆశాం సుభాన్, ఆశ్రమ్ రాజశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కరీం తదితర నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా ..
ఘట్కేసర్ మండలం, చౌదర్‌గూడ గ్రామంలో మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా లహరి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వివాహ మహోత్సవం సందర్భంగా ఘట్కేసర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డి మేడ్చల్ జిల్లా ఎంపీపీిల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పాల్గొని వద్ధులకు, వికలాంగులకు 20వేలతో రెండు క్వింటాల బియ్యం, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వెంకటేష్‌గౌడ్ ఎంపీటీసీలు రామారావు, టీిఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బాలు యాదవ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముస్తఫా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పవన్, మహిళా మండల అధ్యక్షులు మంగమ్మ, మండల యూత్ ఉపాధ్యక్షులు మధు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లింగం యాదవ్, నాయకులు రాములుగౌడ్, నాగరాజ్, లక్ష్మణ్‌గౌడ్, రమేష్ నాయుడు, కష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.