Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనస్థలిపురం
వనస్థలిపురంలోని శ్రీ సంతోషిమాత దేవాలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. అందులో భాగంగా శ్రీ లలితా భక్త బృందంచే భజన సంకీర్తనామృతం, సాయినృత్య తరంగిణి వారి ఆధ్వర్యంలో నాట్య గురువు కె.నాగరాజేశ్వరి శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశ పంచరత్నాలు, దుర్గే, ఇట్టి ముద్దులాడే, ఆడెనే శివుడు వెంకటాచల నిలయం, భావములోన మొదలగు నృత్యాంశాలు ప్రదర్శిం చారు. కళాకారులు ఆద్య, ఆశ్రిత, సిరివర్షిణి, భవాని, రిద్ది, తన్వి, సుధా మాధురి, భవానీమోహన్, ఓజెశ్వనీ వాగ్దేవి, సాయినాగచరణ్లు తమ నాట్య ప్రదర్శనతో భక్తులను అలరించారు. అనంతరం దేవాలయ కమిటీ సర్వేశ్వరి, లక్ష్మి చిన్నారులను సన్మానించి సత్కరించారు.
నేడు డా.అర్థనారీశ్వరం వెంకట్ శిష్యబృందంచే :
నృత్యరత్న డాక్టర్ అర్థనారీశ్వరం వెంకట్ శిష్యబృందంచే ఆదివారం కూచిపూడి నాట్యప్రదర్శన ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు.