Authorization
Fri March 21, 2025 10:34:40 am
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని, పేదలకు అందాల్సిన పట్టాల విషయంలో మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండ్ల పాట్టాలకోసం అనేక ప్రాంతాల్లో ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పారు. పేద ప్రజలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇండ్ల క్రమబద్దీకరణకోసం మరో సారి 58,59 జీవోను అమలు చేస్తున్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో మల్లయ్య, ఎమ్మార్వోలు భూపాల్, సంజీవ రావు, సరిత, డీటీ సుధాకర్ పాల్గొన్నారు.