Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ ప్రమాద ఘటనపై ఏసీపీ సుదర్శన్ వివరణ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో గురువారం రాత్రి 8:30 గంటలకు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన మహేంద్రకారు అతి వేగంగా వచ్చి, సిగల్ వద్ద బొమ్మలు అమ్ముకుంటున్న ముగ్గురు మహిళలను ఢకొీట్టింది. ఆ సమయంలో ఒక మహిళ చేతుల్లోని రెండు నెలల బాబు కిందపడి తలకు తీవ్ర గాయాలై చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే కారు నడపిన వ్యక్తి ఎవరనేది ఆసక్తిగా మారింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి దీనిపై మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పటినుండి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో నాలుగు బందాలుగా ఏర్పడి, సబ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు సుమారు వంద సీసీ కెమెరాలను పరిశీలించి కారు నడిపింది వ్యక్తిని గుర్తించారు. అతని పేరు అఫ్రాన్ చెప్పారు. కారు నడిపినప్పుడు స్టీరింగ్‌పై సేకరించిన క్లూస్లలో భాగంగా ఆఫ్రాన్ అనే వ్యక్తి వేలిముద్రలు సరిపోయాయని నిర్ధారించారు. అతనితో పాటు కారులో రహీల్, మహమ్మద్ మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారులో ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అఫ్రాన్‌ను అదుపులోనికి తీసుకొని అతనితో పాటుకారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విడిచిపెట్టామని చెప్పారు. చనిపోయిన పిల్లాడి డెడ్‌బాడీని అతని కుటుంబ సభ్యులు తీసుకొని రాజస్థాన్‌లోని తమ స్వగ్రామానికి వెళ్లిపోయారని, వారి స్టేట్మెంట్ రికార్డు చేశౄమని తెలిపారు. సిటీలో కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లు, స్టిక్కర్లు దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.