Authorization
Mon March 17, 2025 12:17:37 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ, బహదూర్ పల్లిలోని వార్డులలో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద శంకుస్థాపన చేశారు. వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, కమిషనర్ భోగేశ్వర్, సుంకరి కృష్ణ, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. బహుదూర్పల్లిలోని వార్డ్ నెంబర్ 11 నుంచి 14 వరకు రూ.1.43 లక్షలతో వివిధ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మైసిగారి సుజాత వెంకటేశ్, శివనూరి నవనీత మల్లేశ్, ఏలుగారి సత్యనారాయణ, నరసింగం, భరత్ కుమార్, మున్సిపాలిటీ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.