Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత సర్వసేవా సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి గోరంగా చంద్ర మహాపాత్ర
నవతెలంగాణ-తుర్కయంజాల్
అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల భూదాన భూముల నిగ్గు తక్షణమే తేల్చి, మిగిలి ఉన్న భూదాన భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణీి చేయాలని అఖిలభారత సర్వసేవాసంఫ్ు ప్రధాన కార్యదర్శి గోరంగాచంద్ర మహాపాత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూదాన్ భూములను భూమిలేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, కబ్జా కోరల్లో ఉన్న భూదాన్ భూములను స్వాధీనం చేసుకొని కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత సర్వసేవా సంఫ్‌ు-తెలంగాణ సర్వోదయమండలి సంయుక్తంగా సోమవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఆర్డీఓ కార్యాల యం వద్ద వేలాదిమంది పేదలతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలంగాణ సర్వోదయ మండలి సీనియర్ నాయకులు శాకావత్ చందు నాయక్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా గోరంగాచంద్ర మహాపాత్ర, గౌరవ అతిథులుగా మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, అఖిల భారత సర్వసేవా సంఫ్‌ు మేనేజింగ్ ట్రస్టీ షేక్ హుస్సేన్, తెలంగాణ సర్వోదయ మండలి ఉపాధ్యక్షులు మోటూరి కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంగా చంద్ర మహాపాత్ర మాట్లా డుతూ భూదాన్ ఉద్యమంలో ఆనాడు భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గాంధేయవాది ఆచార్య వినోభాభావే తెలంగాణలో లక్ష డెబ్భై వేల పైచిలుకు ఎకరాలను సేకరించారని గుర్తుచేశారు. సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణలో వేల కోట్ల విలువైన భూదాన్ కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదైన భూ కుంభకోణమని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రభుత్వం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఎండోమెంట్స్, వక్ఫ్, భూదాన్ భూముల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవ డంలేదని, ఫలితంగా భూఅక్రమార్కులు కబ్జాలకు పాల్పడి సొమ్ముచేసుకుంటున్నారని ఆయన వాపో యారు. భూదాన భూముల అన్యాక్రాంతంపై సీబీఐ విచారణ జరిపించాలని అయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ సర్వోదయమండలి రాష్ట్ర నాయకులు పిత్చిరాజు, గజం మురళి, హనుమ నాయక్, షేక్ మహమూద్, అమీనా, భాస్కర్, ఫామీద, దస్రు, కమ్లి బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేతలు ఆర్డీఓ ఈ.వెంకటాచారిని కలసి వినతిపత్రం సమర్పించగా ఆయనే స్వయంగా ధర్నాస్థలికి వచ్చి నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని భూదాన భూములు ఆక్రమణ లకు గురైనవి, ఎన్ని మిగిలి ఉన్నవి తేల్చాలని అన్ని మండలాల తహసీల్దార్లకు లేఖలు రాస్తానని, తేల్చాక ప్రభుత్వానికి తెలిపి భూమిలేని నిరుపేదలను గుర్తించి పంపిణి చేస్తామని తెలిపారు.