Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలని అధికారులకు విద్యార్థినుల వినతి
నవతెలంగాణ -సుల్తాన్‌బజార్
వనస్థలిపురంలోని రెమెడీ, తేజస్వీస్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసినా యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోఠి డీఎంహెచ్ఎస్ం క్యాంపస్ ఆవరణలో సదరు నర్సింగ్స్కూల్ యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గుజరాత్ రాష్ట్రానికి చెందిన తాము వనస్థలిపురంలో రెమిడీ, తేజస్విని నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం కోర్సు చేశామని, మూడేండ్లకు సంబంధించిన ఫీజు మొత్తం కూడా చెలించామని తెలిపారు. ఫీజు తీసుకున్న యాజమాన్యం అందుకు సంబంధించి రిసిప్ట్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు. యజమాన్యంపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌కు గత నెలలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు.