Authorization
Mon March 17, 2025 10:12:53 am
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, బాచుపల్లి పూజిత లేఅవుట్ 20వ డివిజన్లో దాదాపు 400 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి, నిర్మాణం సాగిస్తున్నా మున్సిపల్ కమిషనర్గాని, టౌన్ ప్లానింగ్ సిబ్బంది. గాని ఏమాత్రం పట్టించుకోవడంలేదని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీశ్ తెలిపారు. బాచుపల్లి మండలంలో ఇప్పటికే అనేక చెరువులు, కుంటలు కబ్జాలకు గురి అయ్యాయన్నారు. కబ్జాదారులు అంతటితో ఆగకుండా పార్కుస్థలాన్ని కూడా వదలడం లేదన్నారు. ఈ కబ్జాల వెనుక ఎవరున్నారో అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు.