Authorization
Fri March 21, 2025 08:45:41 am
- ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి నందుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ చౌరస్తాలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం అడ్డు, అదుపు లేకుండా పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలపాలని కోరారు. సామాన్యుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం అడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు పెరిగిన ధరలను అడ్డుకో వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కేంద్రం ఇష్టానుసారంగా పెంచే ధరలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేష్, బుగ్గారపు దయానంద్, మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్‌రావు, తిలక్, నియోజకవర్గ సీనియర్ నాయ కులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, పలు విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.