Authorization
Mon March 17, 2025 11:26:56 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో మౌలిక వసతుల అభివద్ధికి జిహెచ్ఎంసి పెద్దపీట వేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యం కోసం చందానగర్, మదీనాగూడ, దీప్తిశ్రీ నగర్, పీజేఆర్ ఎన్క్లేవ్ వద్ద రూ.10.70కోట్ల వ్యయంతో చేపట్టిన రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..నగరాన్ని సిగల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వర్షకాలంలో వరద నివారణ శాశ్వత పరిష్కారం కోసం రూ.858 కోట్ల వ్యయంతో 60 నాలాల అభివృద్ధి పనులను వచ్చే వర్షాకాలం లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నగరంలో 4 ప్యాకేజీలో రూ. 127.35 కోట్ల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఎగ్జీక్యూటీవ్ ఇంజినీర్ శ్రీకాంత్, హఫీజ్పేట్, చందానగర్ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.