Authorization
Fri March 21, 2025 07:01:17 am
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్ రాఘ వేంద్రనగర్ కాలనీ ఫేస్ 2 వాసులు, టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ వార్డు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వారి కాలనీ లోని సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కాలనీవాసులు మాట్లాడుతూ వారి కాలనీలోని రోడ్ నెంబర్ 5/1 లో సీసీి రోడ్డు వేయించాలని కోరారు. మరియు కాలనీ కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ సహకారంతో అధికారులతో కాలనీలో పర్యటించి దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోకోండ జగన్, రామానుజం, బింగి శ్రీనివాస్, కొల్లూరి శ్యామ్, రాఘవేంద్రనగర్ కాలనీ ఫేస్ 2 సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్. జగదీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు బివిఎస్కేరావు, సహాయ కార్యదర్శి కష్ణయ్య, గోపాల్‌రెడ్డి, ఎండీ.గౌస్, అఖిల, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, రాజలింగం, వేణుగోపాల్, శ్రీనివాస్, జయ పాల్గొన్నారు.