Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ కొంపల్లిలోని సైన్మా రెస్టారెంట్ ఫిబ్రవరి నుంచి ఉగాది పండుగ లోపు బిర్యానీ కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా నిర్వహించింది. ఈ విషయం తనకు ముందే తెలిస్తే తాను సైతం బిర్యానీ కొని కారును గెలుచుకునే వాడినని ఆది అన్నారు. మూడేండ్లుగా తాము ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నా మనీ, తమకు వచ్చిన లాభాలను కస్టమర్లకు అందిం చేందుకు ఈ ఏడాది లక్కీ డ్రా కాంటెస్ట్‌ను నిర్వహిం చామనీ, ఈ కాంటెస్ట్‌లో రేఖ అనే మహిళ కారును దక్కించుకుందని నిర్వహకులు సందీప్ రెడ్డి, అక్షరు రెడ్డి తెలిపారు. సైన్మా రెస్టారెంట్లో వినియోగదారు లకు పాత సినిమా పాటలు, పోస్టర్లు, పాత రేడియోల ద్వారా సంగీతంను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేత రేఖకు హుందారు వెన్యూ కారును త్వరలో అందజేయనున్నట్టు వారు తెలిపారు. వచ్చే ఏడాది సైతం డైనింగ్, పార్సిల్ తీసుకుని వెళ్ళే వారికి సైతం కాంటెస్ట్‌ను నిర్వహిస్తు న్నట్టు అక్షరు రెడ్డి తెలిపారు.