Authorization
Wed March 19, 2025 04:26:36 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికా రులతో మాట్లాడి వెంటనే పరిష్కరింపజేస్తానని బీజేపీ సీనియర్ నాయకులు సురభి రవీందర్ రావు అనానరు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు శేరి లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లో పది రోజుల పాదయాత్రలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరింపజేస్తాన నీ, అందులో భాగంగా ఆదివారం డివిజన్లోని సిక్కు బస్తీలో స్థానికుల సమస్యలపై మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు చెన్నమనేని స్రవంతి, అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకుడు నరేందర్ రెడ్డితో కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కుమార చారి, శివాజీ కస్తూరి, చారి, శ్రీనివాస్, రామచందర్, జీవన్, సంతోష్, అమర్ నాథ్, గురునాథ్, సాయి (భల్లు), సంతోష్, రమేష్, రాము, వినోద్, ఉదయ భాస్కర్, పద్విధర్, రమణ బాబు, సుబ్బారావు, అనిత, సునీత తదితరులు పాల్గొన్నారు.